Sunday, December 23, 2012

రేప్......... రేప్ ....రేప్ ....రేప్....

ప్రస్తుతం దేశాన్నిహోరెత్తిస్తున్న పదం ..........జనాలు అన్నీ మర్చిపోయి మాట్లాడుకుంటున్న నిజం .....

అవును జనాలు అనీ మర్చిపోయారు !!! మనం ఇరవయి ఒకటో శతాబ్దపు మనుషులం కదా !!! అభివృద్ధికి నిలువు అద్దాలం  కదా!!! మూలాన్ని మరిచి ముఖాన్ని చూస్తాం !!! కారణాన్ని వదిలి ఫలితాన్ని చూస్తాం .....!!! 

రోగికి రోగం వస్తే మందు ఇవ్వడమే సరి కాదు ...రోగం మూలం కనుగొని దాన్ని నియత్రించాలి ...నివారించాలి ....నాశనం చేయాలి ... అంటే మందు వద్దా ?? అనే పండితుల ప్రశ్నకు నా సమాధానం " ముందు మందు" కాని మందే మొత్తం కాదు ..............

ఆ ఢిల్లీ అమ్మాయి రేప్ కు గురి కావాడానికి మనమే కారణం మనం అందరం కారణం తప్పు చేస్తే ఎయిడ్స్ వస్తుంది అని తెలిసి కుడా తప్పు చెయ్యండి కాని కండోం పెట్టుకుని చేయండి అనే ప్రభుత్వం కారణం ..........డబ్బుల కోసం అరకొర దుస్తులతో సినిమాల్లో నటించే సినీ తారలు కారణం ...ఫ్యాషన్  పేరుతొ దుస్తుల సైజు తగ్గించిన ఫ్యాషన్ పితామహులు కారణం ....డబ్బుల కోసం పొర్న్ సైట్లు నిర్వహించే నిర్వాహకులు కారణం .........పిల్లలకు  సరైన విలువలు నేర్పని తల్లితండ్రులు కారణం....మేము ఎలాంటి బట్టలైన వేసుకుంటాం మీరు చూసి ఊరికే వెళ్లిపోవాలి గాని మా బట్టల మీద ఎటువంటి కామెంటు చేయకూడదు అనే ఫెమినిస్టులు కారణం ...........

ఓహో !!! ఇది మరీ బాగుందయ్యా పాలేరా !!! మేమందరం కలిసి ఆ రేప్ ని తీవ్రం గా ఖండిస్తున్నాం ...ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ....ఉద్యమం చేస్తున్నాం !!! నువ్వు మమ్ములను దోషులు అంటావెం ??? అంటారా ....కారణం కావాలా ???

ఇదీ కారణం :.ఒక డ్రెస్ మార్కెట్ లో కి వచ్చి బాగా పొపులర్ అయితే అది నేను కుడా కొంటాను , నా ఫ్రెండ్స్ అందరు నాకు ఇష్టం లేని హీరో సినిమా చుసివచ్చి చాలా బాగుంది అంటే "నిజంగా బాగుంది ఏమో ??నాకు ఆ హీరో కి ఏమైనా గొడవలు ఉన్నాయా" !! అని మనసుకి సర్దిచెప్పుకుని సినిమా చూస్తాను, మార్కెట్ లో ఫలానా రకం కారు బాగుంది అంటే నేను కుడా కొందామని ప్రయత్నిస్తాను. సినిమా హీరోల హెయిర్ స్టైల్ చూసి నేను అనుకరిస్తాను, అంటే ....మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇతరులనుండి INFLUENCE పొందుతాం...ఇది నిజం...అలాగే B గ్రేడ్ సినిమాలు చూసి చూసి .....పోర్న్ సైటులు చూసి చూసి....బికినిల్ల్లో హీరోయిన్ లను చూసి చూసి ...రేచాగోట్టే లాగా దుస్తులు ధరించే అమ్మాయిలను రోడ్ల మీద ,షాపింగ్ మాల్లో ,చూసి చూసి.....చూసి ఒక వెధవ ఒకానొక బలహీన క్షణం లో బలాత్కారం చేస్తాడు, ఆ తరువాత వాడి జీవితం సంకనాకి పోతుంది. దరిద్రం వదిలిపోతుంది, ఒక ఆబల బలి కావటానికి ఎంతమంది ఎన్ని రకాలుగా తోడ్పడుతున్నారో ఇప్పుడు ఆలోచించండి.!!! డబ్బు కోసం B గ్రేడ్ సినిమాలు తీసే వ్యాపారస్తులు , మార్కెటింగ్ కోసం పోర్న్ సైట్లు నడిపే వెబ్ నిర్వాహకులు, ఫేం కోసం వెంపర్లాడే అమ్మాయిలు ( హీరోయిన్లు), సంస్కృతీ, సంస్కారం లేకుండా మానవ అవతారంలో అర్ధనగ్నం గా తిరిగే జంతువులూ , అందరు కలిసి ఎవరి బలి కి కారణం అవుతున్నారు..????? నేడు  ఒక ఢిల్లీ అమ్మాయి ... రేపు మరో అమ్మాయి .....


సమస్యను కాదు రండి మూలాన్ని తుడిచేద్దాం .............విలువ ఇచ్చే బట్టలు ధరిద్దాం ....నైతిక విలువలతో బ్రతుకుదాం !!!